నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. కల్యాణ్శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఇటీవల ఈ చిత్ర టైటిల్ టీజర్ విడుదలైంది. ఈ వీడియోలో పెళ్లి కొడుకు అవతారంలో నవీన్పొలిశెట్టి చెప్పిన డైలాగ్స్ చక్కటి వినోదాన్ని పంచుతున్నాయి. ‘నాయుడు గారు..హనీమూన్కు హవాయికి టికెట్లు బుక్ చేశారా? లేదా? డబ్బుల గురించి ఆలోచించకండి ఇక్కడ రాజుగాడి పెళ్లి’..‘మన ఫొటోలు చూసి కత్రినాకైఫ్, విక్కీకౌశల్ కుళ్లుకొని చావాలా’ అనే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ ‘వినోదమే పరమావధిగా రూపొందుతున్న చిత్రమిది. రాజు అనే యువకుడి పెళ్లి నేపథ్యంలో ఎదురయ్యే సంఘటనలు నవ్విస్తాయి. నవీన్ పొలిశెట్టి పాత్ర కొత్తగా ఉంటుంది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: పీడీవీ ప్రసాద్.