Anaganaga Oka Raju | మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత జాతి రత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమాల్లో ఒకటి అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఇప్పటికే లాంచ్ చేసిన ప్రీ వెడ్డింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా నవీన్ పొలిశెట్టికి ప్రమాదం, ఇతర కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. 2026 జనవరి 14న ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది.
తాజాగా మేకర్స్ చాలా రోజుల తర్వాత దీపావళి సందర్భంగా క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్. సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చే్స్తూ.. దివాళి ఫన్ బ్లాస్ట్ ప్రోమోను విడుదల చేశారు.
అరే హ్యాపీ దీపావళి అన్నా.. ఏం కావాలి.. ఏమేం దొరుకుతయంటే పట్టుచీరలు, సిల్క్ శారీస్ అన్ని దొరుకుతాయి.. తన దగ్గర పటాకాయల షాపుకి వచ్చి పట్టుచీరలు దొరుకుతాయా అన్నా.. ? రాజు రాకెట్స్ అంటూ నవీన్ పొలిశెట్టి చెబుతున్న డైలాగ్స్‌తో మొదలైన ప్రోమో సూపర్ ఫన్‌గా సాగుతుంది. అనగనగా ఒక రాజు ఫన్, ఫ్రెస్ నెస్, ఫీల్ గుడ్ హ్యూమర్ టచ్‌తో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా నవీన్ పొలిశెట్టి కామిక్ టైమింగ్ ఉండబోతుందని దీవాళి ఫన్ బ్లాస్ట్ ప్రోమో చెబుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ లో నవీన్ పొలిశెట్టి లుంగీ, బనియన్ వేసుకుని, మెడలో రుమాలు వేసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ బైకుపై వెళ్తూ క్యూరియాసిటీ పెంచుతోంది. సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేస్తుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
ప్రీ వెడ్డింగ్ వీడియో..
రాజుగారి పెళ్లి విందులో చమ్మక్ చంద్ర అరేయ్ ఇది రాజుగారి పెళ్లి.. గెస్టులందరికీ గోల్డ్ ప్లేట్స్ మాత్రమే పెట్టండి.. అంటూ చెప్పే డైలాగ్స్‌తో మొదలైంది ప్రీ వెడ్డింగ్ వీడియో. అతిథుల్లో ఓ వ్యక్తి ఏంటండి వీళ్లు ప్లేటు గోల్డ్.. స్వీటు గోల్డ్ అంటున్నారు.. ఇదేమైనా మలబార్ గోల్డ్ వాళ్ల పెళ్లా అని అడుగుతుంటే.. మరో వ్యక్తి ఏవండి ఇది మా రాజుగారి పెళ్లండి అని అంటున్నాడు.
నవీన్ పొలిశెట్టి ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తూ.. ముఖేశ్ అంబానీకి ఫోన్ చేసి.. ముఖేశ్ మామయ్యా ఈవెంట్‌కు వచ్చిన సెలబ్రిటీల ఫోన్ నంబర్లు పెట్టు చెబుతా.. ఈ ఇయర్ అంతా అంబానీ పెళ్లి.. వచ్చే ఏడాదంతా రాజుగారి పెళ్లి అంటున్నాడు. జాతి రత్నాలు హీరో స్టైల్ ఆఫ్ హ్యూమర్ టచ్‌తో సాగుతున్న వీడియో సినిమాపై అంచనాలు అమాంతం చేస్తోంది.
Diwali Fun Blast Promo..