‘బింబిసార’ అద్భుత విజయంతో ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉన్నారు అగ్రహీరో కల్యాణ్‌రామ్. ప్రస్తుతం ఆయన ‘అమిగోస్’ ‘డెవిల్’ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ ‘డెవిల్’ చిత్రాన్ని నిర్మిస్తున్నది. 1945 మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్య కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నారు.
ఓ రహస్యాన్ని ఛేదించే క్రమంలో బ్రిటీష్ గూఢచారికి ఎదురైన సవాళ్లేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. గత ఏడాది విడుదలైన కల్యాణ్‌రామ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వెలువడింది. తమిళనాడు కారైకుడిలో ఇరవై రోజుల పాటు తాజా షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఇందులో కల్యాణ్‌రామ్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు.