Eleven | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటుడు నవీన్‌చంద్ర (naveen chandra). ఈ యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం లెవన్ (Eleven). ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లోకేశ్ అజిల్స్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా మేకర్స్ లెవన్ టీజర్‌ను లాంఛ్ చేశారు.
వరుస హత్యలు చేస్తున్న హంతకుడిని పట్టుకునే పోలీసాఫీసర్ పాత్రలో నవీన్ చంద్ర కనిపించబోతున్నట్టు టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. వరుస హత్యల వెనక ఎవరున్నారనేది సస్పెన్స్‌లో పెడుతూ.. హత్యలను చేధించే క్రమంలో ఇంట్రెస్టింగ్గా మూవీ సాగనున్నట్టు హింట్ ఇస్తూ కట్ చేసిన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రంలో రెయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, రవి వర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లెవన్ టీజర్..
The Hunt Begins 🩸
The Nerve-racking Investigative Thriller #ELEVENTeaser Out Now!
#ELEVEN coming soon in cinemas💥@Naveenc212 @lokeshajls @abhiramiact @Riythvika @immancomposer @ActorDileepan @actorshashank @tweetravivarma @kirrD @karthikisc… pic.twitter.com/XyKcjynaYl
— BA Raju’s Team (@baraju_SuperHit) June 19, 2024