Pushpa 2 | ఇప్పుడు ఇండియాలో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఏదైనా ఉందా? అంటే అది పుష్ప-2 అనే చెప్పాలి. లెక్కల మాస్టార్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో 2022 డిసెంబర్లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తగ్గేదేలే.. అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సినిమాను ఢీకొట్టేందుకు నేచురల్ స్టార్ నాని రెడీ అవుతున్నాడు. పుష్ప -2 రిలీజయ్యే రోజే తన సరిపోదా శనివారం సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
నిజానికి పుష్ప-2 గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల షూటింగ్ జాప్యం కావడంతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన సినిమాను రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. కానీ పుష్ప2 మళ్లీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పుష్ప2 వాయిదా పడితే ఆ డేట్‌ను లాక్ చేసుకోవాలని చాలామంది ప్రొడ్యూసర్స్ ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా ఏప్రిల్‌లో విడుదలవుందని ముందుగా అనౌన్స్ చేశారు. కానీ అనుకున్న టైమ్‌కి ఈ సినిమా వచ్చే అవకాశం లేదని.. వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తుంది. పుష్ప 2 రాకపోతే ఆగస్టు 15న దేవర సినిమాను తీసుకురావాలని భావిస్తున్నారు. ఇండియన్2, గేమ్‌ఛేంజర్ సినిమాలు కూడా ఇదే డేట్‌పై ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ముందుగానే అలర్ట్ అయిన డీవీవీ దానయ్య, నాని సరిపోదా శనివారం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. మరి అనుకున్నట్టుగానే పుష్ప 2 వాయిదా పడుతుందా? లేదా తగ్గేదేలే అని అదే టైమ్‌కి వస్తుందా? అనేది చూడాలి.
ఇక సరిపోదా శనివారం సినిమా విషయానికొస్తే ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ, లవ్ స్టోరీలనే తెరకెక్కించిన వివేక్.. ఈసారి యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సరిపోదా శనివారం సినిమాను తీసుకొస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా గ్యాంగ్ లీడర్ తర్వాత నాని- ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో గ్యాంగ్ లీడర్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని కూడా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మర