National Crush | కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో స్టార్ హీరోయిన్ ఇప్పుడు తన హవా చాటుతుంది. ‘సప్త సాగరదాచె ఎల్లో’ సినిమాతో పరిచయమై, ‘కాంతార ఛాప్టర్ 1’లో కనకవతి పాత్రలో నటించిన రుక్మిణి వసంత్ ఇప్పుడు నేషనల్ స్థాయిని దాటి ఇంటర్నేషనల్ క్రష్‌గా మారిపోయారు. ‘కాంతార ఛాప్టర్ 1’ బ్లాక్‌బస్టర్ విజయంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన కాంతార చాప్టర్ 1 చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. కన్నడ సినిమా రంగంలో ఇదొక అరుదైన రికార్డు. అద్భుతమైన కథ, దృశ్యకావ్యం లాంటి విజువల్స్‌తో పాటు, రుక్మిణి వసంత్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటి వరకు ‘నేషనల్ క్రష్’గా రష్మిక మందన్న పేరు వినిపిస్తుండగా, ఇప్పుడు ఆ స్థానం రుక్మిణికి చెందిందని నెటిజన్లు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఆమెను కర్ణాటక క్రష్, కన్నడ క్రష్, ఇంటర్నేషనల్ క్రష్ అంటూ పిలుస్తున్నారు. రష్మిక మందన్నపై ఇటీవల కన్నడ ప్రేక్షకుల్లో కొంత వ్యతిరేకత నెలకొన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో రుక్మిణి వసంత్ ‘కాంతార 2’ విజయంతో వెలుగులోకి రాగా ఆమెను రష్మికకు బదులుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారన్న వార్తల నడుమ, ఆమె వెనుకబడతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ప్రస్తుతం రుక్మిణి వసంత్ తమిళ, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ‘కాంతార 2 ‘ విజయంతో ఆమె కెరీర్లో కొత్త అధ్యాయం మొదలైందనడంలో సందేహమే లేదు. ఇక రష్మిక మందన్న స్థాయిని రుక్మిణి వసంత్ చేరతారా? లేక ఈ క్రేజ్ తాత్కాలికమా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా రష్మిక మందన్నా క్రేజ్ ఇప్పుడు ఏమి తగ్గలేదు. ఆమెకి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయం సాధిస్తూనే ఉంది. మరి రష్మిక, రుక్మిణి ఫైట్‌లో గెలుపెవరిదో చూడాలి.