71st National Awards | 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రంగా బాలీవుడ్ చిత్రం ‘12th ఫెయిల్’ ఎంపిక కాగా, ‘ఉత్తమ నటుడు’ అవార్డును ‘జవాన్’ చిత్రం నుంచి షారుక్‌ఖాన్, ‘12th ఫెయిల్’ చిత్రం నుంచి విక్రాంత్ మస్సే పంచుకున్నారు. ఇక మరో బాలీవుడ్ చిత్రం ‘మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’లో అద్భుతమైన నటనను కనబరచినందుకు సీనియర్ నటి రాణి ముఖర్జీ జాతీయ ఉత్తమనటిగా ఎంపికయ్యారు. అయితే వీటితో పలు సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి. అయితే ఆ సినిమాలు ఏయో ఓటీటీలలో ఉన్నాయి అనేది చూసుకుంటే.!
ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్ (జియో హాట్‌స్టార్)
ఉత్తమ నటుడు: జవాన్ (హిందీ) షారుక్‌ఖాన్ (నెట్‌ఫ్లిక్స్)
ఉత్తమ నటి: మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే(హిందీ) రాణీ ముఖర్జీ (నెట్‌ఫ్లిక్స్)
ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి (జియో హాట్‌స్టార్)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ) (అమెజాన్ ప్రైమ్ వీడియో)
ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం: సామ్ బహదూర్(హిందీ) (జీ5)
ఉత్తమ బాలల చిత్రం: నాల్ 2 (మరాఠీ) (అమెజాన్ ప్రైమ్ వీడియో)
ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ: హను-మాన్(తెలుగు) (జీ5)
ఉత్తమ దర్శకత్వం: ది కేరళ స్టోరీ (హిందీ) సుదీప్తో సేన్ (జీ5)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతివేణి (గాంధీతాత చెట్టు) (అమెజాన్ ప్రైమ్ వీడియో)
ఉత్తమ కథనం: బేబీ(తెలుగు) సాయిరాజేష్ నీలం (ఆహా)
ఉత్తమ సంభాషణలు: సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (హిందీ) (జీ5)
ఉత్తమ కథనం: పార్కింగ్ (తమిళం) (జియో హాట్‌స్టార్)
ఉత్తమ సౌండ్ డిజైన్: యానిమల్(హిందీ) (నెట్‌ఫ్లిక్స్)
ఉత్తమ సంగీతం: వాతి(తమిళ్) తెలుగులో సార్(నెట్‌ఫ్లిక్స్)
ఉత్తమ ఎడిటింగ్: పూక్కాలమ్(మలయాళం) మిథున్ మురళి (జియో హాట్‌స్టార్)