National Award Winners Jani Master | ‘ప్రభుదేవాగారి ‘వెన్నెలవే వెన్నెలవే..’ పాటంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటకు అప్పట్లో నేషనల్ అవార్డు వచ్చింది. అలాంటి పాటే ఒకటి నేనూ చేయాలని కలగనేవాడ్ని. ఆ ఛాన్స్ ధనుష్ ‘తిరుచిత్రాంబలం’తో నాకు దక్కింది. ఈ పాటకు కూడా నేషనల్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. నిజానికి కోలీవుడ్‌లో ఎంతోమంది గొప్ప కొరియోగ్రాఫర్లున్నారు. కానీ ధనుష్ నన్నే పిలిచి చేయించారు. ఈ సందర్భంగా ధనుష్గారికీ, ‘తిరుచిత్రాంబలం’ మేకర్స్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా’ అని జానీ మాస్టర్ అన్నారు. ‘తిరుచిత్రాంబలం’ చిత్రంలోని ‘మేఘం కరుగాత..’ పాటకు గాను ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్‌గా ఆయన నేషనల్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తెలుగు చిత్రప్రముఖుల సాక్షిగా జరిగిన సన్మాన కార్యక్రమంలో జానీ మాస్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాన్సర్స్ అసోసియేషన్ నాయకులు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్‌కుమార్ వల్లభనేని, ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదరప్రసాద్, శేఖర్ మాస్టర్ తదితరులు పాల్గొని జానీ మాస్టర్ని అభినందించారు.