సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘నాతో నేను’. ప్రశాంత్ టంగుటూరి దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టీజర్ చూస్తుంటే సినిమా కూడా కొత్తగా ఉంటుందని పిస్తుంది. కథలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా ఆ కోవలో చేరాలని ఆశిస్తున్నాను’ అన్నారు.