శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సాక్షివైద్య, సంయుక్తమీనన్ కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. బుధవారం ఈ సినిమా నుంచి ‘దర్శనమే…’ అంటూ సాగే తొలి గీతాన్ని విడుదల చేశారు. విశాల్‌చంద్రశేఖర్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సంగీతాన్నందించారు. యాజిన్ నిజార్ ఆలపించారు. ‘దర్శనమే మధుర క్షణమే, నీవు నేను ఇక మనమే, మనసున మోగే మంగళ నాదస్వరమే’ అంటూ చక్కటి మెలోడీతో భావయుక్తంగా సాగిందీ పాట. నాయకానాయికలు శర్వానంద్, సంయుక్తమీనన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, ముక్కోణపు ప్రేమకథగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కథ: భాను భోగవరపు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.