Nargis Fakhri | బాలీవుడ్ గ్లామర్ డాల్ నర్గీస్ ఫక్రీ వ్యక్తిగత జీవితం ఇప్పటిదాకా ఎంతో గోప్యంగా సాగింది. కానీ ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఈవెంట్లో ఆమె పెళ్లి రహస్యం వెలుగులోకి వచ్చింది. అందుకు కారణం దర్శకురాలు ఫరా ఖాన్ చేసిన సరదా కామెంట్. ఈ ఈవెంట్‌కి ఫరా ఖాన్, నర్గీస్‌తో పాటు ఆమె సన్నిహితుడు టోనీ బేగ్ కూడా రెడ్ కార్పెట్‌పై కనిపించారు. ఈ సందర్భంలో ఫరా, టోనీని ఉద్దేశించి.. “టోనీ.. వచ్చి నీ భార్య పక్కన నిలబడు!” అని చెప్పడంతో, అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. అంటే నర్గీస్-టోనీ ఇప్పటికే వివాహం చేసుకున్నారని, ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారని అందరు భావించారు.
నర్గీస్ ఫక్రీ – టోనీ బేగ్‌ల వివాహం 2025 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో నిరాడంబరంగా జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి స్విట్జర్లాండ్ హనీమూన్‌కు వెళ్లారు. ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎక్కడా నర్గీస్ స్పందించకపోవడం, ఎటువంటి ఫోటోలను షేర్ చేయకపోవడం గమనార్హం. నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా కనిపించే నర్గీస్ తన వ్యక్తిగత విషయాన్ని ఇంత గోప్యంగా ఉంచడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతమంది ఇది ప్రైవసీకి ఇచ్చిన ప్రాధాన్యత అని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది మాత్రం ఇంత ముఖ్యమైన విషయం పంచుకోకపోవడమేంటి? అంటూ కామెంట్ చేస్తున్నారు.
బాలీవుడ్లో ‘రాక్‌స్టార్’ సినిమాతో పరిచయమై తొలి సినిమాతోనే స్టార్డమ్ అందుకున్నారు నర్గీస్ ఫక్రీ. ఇటీవల ‘హౌస్‌ఫుల్-5’ సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై సానుకూల స్పందనను అందుకుంది. ఇటీవల నర్గీస్ తన డైట్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. నేను తొమ్మిది రోజులపాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను. ఇది చాలా కష్టం.9 రోజులు పూర్తయ్యే సరికి ముఖం చాలా వికృతంగా మారడం, కళ్లు, బుగ్గలు లోపలకు వెళ్లిపోయి, దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఫేస్ లో మాత్రం కాస్త గ్లో కనిపిస్తుంటుంది అని చెప్పుకొచ్చింది. తరచూ నీళ్లు తాగుతూ ఉంటాను. విటమిన్స్, మినరల్స్ తదతర మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను అని నర్గీస్ ఫక్రి పేర్కొంది.