ఓటీటీలోనే ‘నారప్ప’..జులై 20న అమెజాన్ ప్రైమ్లో ప్రీమియర్
చాలా రోజుల చర్చల తర్వాత చివరికి నారప్ప ఓటిటి బాటనే పట్టాడు. వెంకటేష్ సినిమా కూడా నేరుగా డిజిటల్ లో వచ్చేస్తుంది.

చాలా రోజుల చర్చల తర్వాత చివరికి నారప్ప ఓటిటి బాటనే పట్టాడు. వెంకటేష్ సినిమా కూడా నేరుగా డిజిటల్ లో వచ్చేస్తుంది. పరిస్థితులు పగ బట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు..? తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు ఇలాగే తయారైపోయింది. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా థియేటర్లు ఇప్పటికీ పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. ఒకవేళ తెరిచిన తర్వాత కూడా ప్రేక్షకులు ముందులా వస్తారా లేదా అనేది అనుమానమే. తొలిదశ కరోనా వైరస్ పూర్తి అయిన తర్వాత.. రెండో దశ ఎలా ఉంటుందో తెలియక అప్పట్లో థియేటర్లకు జనాలు బాగానే వచ్చారు.
సెకండ్ వేవ్ ఫలితం చూసిన తర్వాత.. అది చేసిన దారుణాలు తెలిసిన తర్వాత థియేటర్లకు మళ్ళీ ఆడియెన్స్ వస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలాంటి సమయంలో కొన్ని సినిమాలకు ఓటిటి తప్ప మరో మార్గం కనిపించడం లేదు. మంచి రేటు వస్తే నేరుగా డిజిటల్ లో విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అసురన్ సినిమాకు రీమేక్.

అక్కడ ధనుష్ పోషించిన పాత్రను ఇక్కడ వెంకీ చేశాడు. ఈ సినిమా ముందు నుంచి థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో జూలై 20న అమెజాన్ ప్రైమ్ మీడియాలో నేరుగా విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు వెంకటేష్ నటిస్తున్న దృశ్యం 2 కూడా ఓటిటిలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. రానా హీరోగా నటిస్తున్న విరాట పర్వం సినిమా సైతం అమెజాన్ ప్రైమ్ లో రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
All my well-wishers and fans have been eagerly waiting to watch our film, #Narappa. Your love towards this film has been overwhelming for me and the team, who always ensured to go an extra mile just like Narappa. pic.twitter.com/5lEMa86pRb
— Venkatesh Daggubati (@VenkyMama) July 12, 2021
ఇవి కూడా చదవండి..
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
ఐటెంసాంగ్ తో సన్నీలియోన్ సందడి
బీచ్లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
యూట్యూబ్లో అజిత్ ‘వలిమై’ రికార్డుల మోత
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

