 
                                                            Nara Rohith | టాలీవుడ్ హీరో నారా రోహిత్ (Nara Rohith) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కన్వెన్షన్ సెంటర్లో ఆయన నటి శిరీషను వివాహం చేసుకున్నారు. ఈ వేడుక ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. వివాహ వేడుకకు రోహిత్ పెదనాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, తోపాటు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నారా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడైన రోహిత్, రాజకీయ కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. సినిమాలపై ఉన్న ఆసక్తి వల్ల ఆయన న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందారు. 2009లో విడుదలైన ‘బాణం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత సోలో, అసుర, రౌడీ ఫెలో, జో అచ్యుతానంద, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు, ప్రతినిధి 2 వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆయన నటించిన ‘భైరవం’, ‘సుందరకాండ’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతమయ్యాయి. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా రోహిత్ తన ప్రతిభను చాటుకుంటున్నారు.
‘ప్రతినిధి 2’ సినిమాలో హీరోయిన్గా నటించిన శిరీషతో రోహిత్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇద్దరి కుటుంబాల అంగీకారంతో గతేడాది ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి కారణంగా వివాహం కొంతకాలం వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగి, ఇద్దరూ అక్టోబర్ 30 రాత్రి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో చంద్రబాబు నాయుడు – భువనేశ్వరి దంపతులు పెద్దలుగా వ్యవహరించారు. శిరీష స్వస్థలం రెంటచింతల (ఆంధ్రప్రదేశ్). ఆమె తల్లిదండ్రులకు నాలుగో సంతానంగా జన్మించిన శిరీష చిన్నప్పటి నుంచే ప్రతిభావంతురాలు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య పూర్తిచేసి అక్కడ కొంతకాలం ఉద్యోగం చేశారు. కానీ నటనపై ఉన్న ప్యాషన్ ఆమెను తిరిగి భారతదేశానికి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో తన అక్క ప్రియాంక వద్ద ఉండి సినిమాల్లో అవకాశాలు వెతికే క్రమంలో ‘ప్రతినిధి 2’ కోసం జరిగిన ఆడిషన్లో ఎంపికై, అదే సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది.ఇప్పుడు ఆమె నారా కుటుంబం కోడలు కావడంతో సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
Beautiful moments at Nara Rohit anna’s wedding 💐❤️ #HyderabadDiaries @naralokesh @IamRohithNara pic.twitter.com/7PPGHUewsI
— RudraTeja Akhanda² (@Rudrateja_chow) October 30, 2025
మా ఇంటి పెళ్లి సందడి.. నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి… pic.twitter.com/Tq3nVXtsmO
— N Chandrababu Naidu (@ncbn) October 30, 2025
 
                            