Sundarakanda | యువ కథానాయకుడు నారా రోహిత్ (Nara Rohith) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’ (Sundarakanda). ఈ సినిమాకు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి విజయ్‌కుమార్, వ్రితి వాఘని హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 27న వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే.. మిడిల్ ఏజ్‌కి వచ్చి యువకుడికి పెళ్లి కష్టాలంటే ఎలా ఉంటాయో చూపించారు మేకర్స్. హిలేరియస్‌గా ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.