Animal | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం యానిమల్ (Animal). సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) డైరెక్ట్ చేస్తున్నాడు. కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ఇటీవలే యానిమల్ నుంచి Satranga (తెలుగులో NeyVeyRey) అంటూ సాగే రెండో పాటను లాంఛ్ చేశారని తెలిసిందే.
తాజాగా ఈ సినిమా నుంచి నాన్న నువ్ నా ప్రాణం అంటూ సాగే మూడో సాంగ్‌ను రేపు విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. తండ్రీకొడుకుల ఎమోషనల్ బాండింగ్‌తో పాట ఉండబోతున్నట్టు సాంగ్ లుక్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఇప్పటికే లాంఛ్ చేసిన యానిమల్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. యానిమల్ హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తండ్రీకొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సూపర్ థ్రిల్ అందించేలా యానిమల్ ఉండబోతుందని బీటౌన్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. యానిమల్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Heartwarming song #NannaNuvNaaPranam
from #AnimalTheFilm, releasing tomorrow. 🎶#RanbirKapoor @iamRashmika pic.twitter.com/NlscNg9hGQ
— Suresh PRO (@SureshPRO_) November 13, 2023
Satranga సాంగ్..
తెలుగు వెర్షన్ సాంగ్..
Satranga is yours noww🤍https://t.co/DEvMZcMcTm#Animal2ndSong #AnimalOn1stDec #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @thedeol @tripti_dimri23 @arijitsingh @singer_karthik @shreyaspuranik@KuttiKalam @IananthaSriram@EricnPillai #DurgeshRRajbhatt… pic.twitter.com/guheXsKtrE
— Rashmika Mandanna (@iamRashmika) October 27, 2023