Nani | ఒక్క శనివారం సరిపోదు.. ఇది వీకెండ్‌కు మాత్రమే పరిమితమయ్యే సినిమా కాదు: నాని
ఈ సినిమా విడుదల రోజు నుంచే ఎన్నో ప్రశంసలు, అభినందనలు వస్తున్నాయి. థియేటర్స్‌లో ఆడియెన్స్ జోష్ చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మంచి సినిమాకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడతారని మరోసారి నిరూపితమైంది’ అన్నారు నాని.
Nani | ‘ఈ సినిమా విడుదల రోజు నుంచే ఎన్నో ప్రశంసలు, అభినందనలు వస్తున్నాయి. థియేటర్స్‌లో ఆడియెన్స్ జోష్ చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మంచి సినిమాకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడతారని మరోసారి నిరూపితమైంది’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ‘సరిపోదా శనివారం’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం థాంక్స్‌మీట్‌ను నిర్వహించారు. నాని మాట్లాడుతూ ‘ఇది కేవలం వీకెండ్‌కు మాత్రమే పరిమితమయ్యే సినిమా కాదు. లాంగ్ రన్ ఉండబోతున్నది. ఇంత వర్షంలో కూడా అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి.
‘నిన్ను కోరి’ తర్వాత నిర్మాత దానయ్యగారి సంస్థలో మరో హిట్ కొట్టడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఒక్క శనివారంతో ఆగిపోదు…ఎన్నో శనివారాలను దాటుకొని వెళుతుంది’ అన్నారు. హీరో నాని ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే సినిమాను అనుకున్న విధంగా తీయగలిగానని, ఇంత లార్జ్‌స్కేల్ ఉన్న సినిమాను నేను తీస్తానని నమ్మిన నిర్మాత దానయ్యగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పారు. ప్రీరిలీజ్ ఈవెంట్లోనే ఈ సినిమా భారీ సక్సెస్ ఖాయమని ఊహించానని, ఈ నెల 5న గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించబోతున్నామని నిర్మాత డీవీవీ దానయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీరాజా, సాయికుమార్, కథానాయిక ప్రియాంక మోహన్ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

