Hero Nani | నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘దసరా’ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. నాని పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వందకోట్ల వసూళ్లను సాధించింది. తన ద్వితీయ చిత్రాన్ని కూడా నాని హీరోగానే చేయబోతున్నానని దర్శకుడు శ్రీకాంత్ ఓదేల ఓ సందర్భంలో చెప్పారు.
నాని కూడా ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా ‘దసరా’కు సీక్వెల్ కాదని, సరికొత్త కథాంశంతో ఉంటుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.