Nani| టాలీవుడ్ హీరో నాని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు.కష్టాన్ని నమ్ముకొని టాప్ హీరోగా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌తో అతని కెరీర్ మొదలు కాగా ఇప్పుడు టాప్ హీరోలలో ఒకరిగా, సక్సెస్ ఫుల్ నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు నాని. సహజ నటనతో నేచురల్ స్టార్ అనే బిరుదుని కూడా దక్కించుకున్నాడు. ఇక నిర్మాతగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. నాని సినిమాలు సూపర్ హిట్ కాకపోయిన ఫ్లాప్ అయితే కావు. కనీసం ఎబోవ్ యావరేజ్ అయిన నడుస్తుంది. గత కొన్నేళ్లుగా నాని సినీ రంగంలో చేసిన ప్రయోగాలు, తీసుకున్న నిర్ణయాలు పరిశీలిస్తే అతని టాలెంట్ ఏ పాటిదో అర్ధమవుతుంది.
ఓ స్టార్ హీరోగా భారీ మార్కెట్ కలిగి ఉండే నాని, మాస్ యాక్షన్ సినిమాలకు పరిమితం కాకుండా, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ‘దసరా’ లాంటి గ్రామీణ యాక్షన్ డ్రామా తీసిన నాని , వెంటనే ‘హాయ్ నాన్న’ లాంటి హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రం చేశాడు. నిర్మాతగా ఇండస్ట్రీకి కొత్త వారిని పరిచయం చేస్తూ మంచి సక్సెస్‌లు అందుకుంటున్నాడు. ‘అ!’తో ప్రశాంత్ వర్మను, ‘జర్సీ’తో గౌతమ్ తిన్ననూరిని, ‘శ్యామ్ సింగరాయ్’తో రాహుల్ సాంకృత్యాయన్‌ను, ‘దసరా’తో శ్రీకాంత్ ఒదేలాను, ‘హాయ్ నాన్న’తో షౌర్యువ్ వంటి దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత నానిదే.
తాజాగా కోర్ట్ అనే సినిమాతో రామ్ జగదీష్ అనే డైరెక్టర్ని పరిచయం చేశాడు నాని.అతనిపై నాని పెట్టుకున్న అంచనాలు వమ్ము కాలేదు. సినిమా సూపర్ హిట్ అయింది. గతంలో ఎన్నో కోర్ట్ డ్రామాలు వచ్చాయి కాని నాని నిర్మించిన కోర్ట్ మాత్రం ఎమోషనల్‌గా ప్రేక్షకులని ఎంతగానో కదిలించింది. నాని ప్రత్యేకత ఏమిటంటే, కేవలం తన మార్కెట్‌ను మెయింటైన్ పెంచుకోవడం కాకుండా ఇండస్ట్రీకి కొత్త దర్శకులని పరిచయం చేస్తున్నాడు. ‘నాని నమ్మితే ఓ సినిమా హిట్ అవ్వగలదు’ , ‘నాని వెంట ఉంటే చిన్న సినిమా కూడా బ్లాక్‌బస్టర్’ అనే నమ్మకం సినీ ప్రేక్షకులకి వచ్చేసింది. ఇక నాని రానున్న రోజుల్లో ఇంకెంత మంది కొత్త దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడో, ఎలాంటి భిన్నమైన కథలని ప్రేక్షకుల ముందుకు తెస్తాడో చూడాలి.