నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. ఇంతకు ముందు నానితో అంటే సుందరానికి చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకుడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దానయ్య బ్యానర్ నుండి వస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నాని మాట్లాడుతూ ”మా నిర్మాత దానయ్యగారు ఏ సినిమాకూ కథ తెలీయదు. లొకేషన్ కు వచ్చి అన్నీ మీరే చూసుకోండని అంటారు. కానీ ఆయనకు అదృష్టం కలిసి వస్తుంది. అందుకే కాబోలు సరిపోదా శనివారం, ఓజీ లాంటి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి’ అన్నారు దీంతో అక్కడ వున్నవారు అందరూ ఏంటీ నాన్న.. పాపం దానయ్యను అలా తీసిపారేశాడు అనుకున్నారట.
ప్రతి సినిమాకు నిర్మాత ఎంతో ముఖ్యం. డబ్బులు మొత్తం పెట్టుబడిగా పెడితే. సినిమ హిట్ అయితే డబ్బు వస్తుంది.. లేకపోతే లేదు. ఒకప్పుడు నిర్మాతలు అంటే.. ఖచ్చితంగా కథ మొత్తం తెలుసుకుని, కథలో ఇన్వాల్వ్ అవుతూ.. ప్రతి రోజు సెట్స్ మీద వుండి షూటింగ్ దగ్గరుండి చూసుకుంటారు. అప్పట్లో స్వర్గీయ నిర్మాత డా.డి.రామానాయుడు ఇదే పద్దతిని అవలభించేవాడు. ఆ నిర్మాతగా ఎందరికో ఆయన ఆదర్శ ప్రాయుడు.
అంతే కాదు బడ్జెట్ కూడా వాళ్ల కంట్రోల్లో వుండేది. ఈ రోజుల్లో ఇలాంటి నిర్మాతల్లో దిల్‌రాజు మినహా ఇంకెవరు ఇలా కనిపించడం లేదు. ఈ రోజుల్లో నిర్మాత అంటే క్యాషియర్ అనే పదానికి అద్దం పట్టే విధంగా వున్నాడని దానయ్య గురించి నాని చేసిన కామెంట్స్ చూస్తుంటే మరోసారి అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాను నిర్మించిన దానయ్యకు ఆ సినిమాకు రాజమౌళి లాంటి గొప్ప సపోర్ట్ వుంది. పైగా ప్రతి సినిమాలో పేరు కనిపించకోపోయినా రాజమౌళి కూడా నిర్మాతగానే వుంటాడు..
సో.. ఆర్ఆర్ఆర్ విషయంలో అలా వున్న నో ప్రాబ్లమ్. కానీ సరిపోదా శనివారం సినిమాకు ఇంతకుముందు ఫ్లాప్ ఇచ్చినా దర్శకుడితో సినిమా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నిర్మాతకు కథ తెలిసి వుండాలి.. అంతేకాని కేవలం కాంబినేషన్‌కు నమ్ముకుని సినిమా తీసి.. కేవల క్యాషియర్‌గా వ్యవహరిస్తే.. కుదరదు.. ఇకనైనా నాని మాటలను సీరియస్‌గా తీసుకుని ఆలోచించండి దానయ్య గారు. మీరు ఖచ్చితంగా మీ సినిమా కథలు తెలుసుకోండి… లేకపోతే ఎప్పుడూ అదృష్టం మన వెంటనే వుండదు అంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు..!