ఇటీవలే నిర్మాతగా మీట్‌క్యూట్ సినిమాను ప్రేక్షకులకు అందించాడు న్యాచురల్ స్టార్ నాని(Nani). ఈ హీరో నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ దసరా (Dasara). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నింగ్ నటి కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా చాలా రోజుల తర్వాత ఈ మూవీ షూటింగ్ అప్డేట్ అందించాడు. దసరా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేశాడు నాని.
చివరి షెడ్యూల్లో మొదటి రోజు అంటూ షూటింగ్ స్పాట్లో తీసిన స్టిల్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు నాని. 15 రోజులపాటు కొనసాగనున్న ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ అప్డేట్తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దసరా చిత్రంలో కీర్తిసురేశ్ పక్కా పల్లెటూరి యువతిగా డీగ్లామరైజ్డ్ లుక్‌లో కనిపించనుంది. ఈ చిత్రంలో జరీనా వహబ్, సాయికుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దసరా చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానిక సత్యన్ సూర్యన్ ఐఎస్సీ సినిమాటోగ్రాఫర్ కాగా.. తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2023 మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.