“ఎప్పుడెప్పుడు ఆడియన్స్‌తో కలిసి సినిమా చూస్తానా అని ఆశగా ఎదురుచూస్తున్నా. వివేక్ గొప్ప సినిమా తీశాడు. అతని శివతాండవం ఈ నెల 29న చూస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ ఆర్.ఆర్తో సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాడు. క్వాలిటీకోసం అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. కలిసొచ్చే కాలానికి నడిసొస్తున్న సినిమా మా ‘సరిపోదా శనివారం’.”
అని హీరో నాని అన్నారు. ఆయన హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’. డి.వి.వి.దానయ్య సమర్పకుడు. కల్యాణ్ దాసరి నిర్మాత. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌తో నాని మాట్లాడారు.
నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ ‘సినిమా చూశాను. బ్లాక్బాస్టర్ అవుతుంది. కథల సెలక్షన్లలో నాని నంబర్‌వన్. ఆయనతో సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్‌కి టెన్షన్ ఉండదు. దర్శకుడు వివేక్ పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు.’ అని జోస్యం చెప్పారు. ‘నాని నాకు ఛాన్స్ ఇవ్వలేదు. కాన్ఫిడెన్స్ ఇచ్చారు.
‘సరిపోదా శనివారం’తో నాని నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నా’ అని దర్శకుడు వివేక్ ఆత్రేయ పేర్కొన్నారు. ఇంకా ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్.జె.సూర్య, దర్శకులు దేవ కట్టా, ప్రశాంత్‌వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, నిర్మాత సుధాకర్ చెరుకూరి, అలీ, అభిరామి, అదితి, అనితాచౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.