Nani | నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా దూసుకుపోతున్నాడు నాని. నాని నిర్మించిన ప్రతీ సినిమా ఒక ప్రత్యేకతను కలిగి ఉండడంతో నిర్మాతగా ఆయన తీసే సినిమాలపై కూడా ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇటీవల ‘కోర్ట్’ మరియు ‘హిట్ 3’ వంటి సినిమాలతో నిర్మాతగా నాని భారీ విజయాలు అందుకున్నాడు. ముఖ్యంగా హిట్ ఫ్రాంఛైజీ తన ప్రొడక్షన్ హౌస్ నుంచే కొనసాగుతుండటం గమనార్హం. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించాయి. అయితే ఈ ఫేజ్‌లో నటుడిగా కన్నా నిర్మాతగా నాని ఎక్కువ సక్సెస్‌లో ఉన్నాడన్నది పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
నాని సినిమా ఎంపికలో తన టేస్ట్‌కి తగిన కథలనే సెలెక్ట్ చేస్తాడు. కథను నిర్మాతగా కాకుండా, ఒక సాధారణ ప్రేక్షకుడిగా వినడం వల్లే అతడి జడ్జ్మెంట్ నూరుకి నూరుపాళ్లు సక్సెస్ అవుతుంది. ‘అ!’ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నాని, తాజాగా హిట్ సినిమాతో తన స్థాయిని పెంచుకున్నాడు. నాని ..శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చిరంజీవితో ఓ భారీ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇది అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ గురించి జోరుగా చర్చ నడుస్తుంది..అయితే ఈ ప్రాజెక్టు కన్నా ముందు ఒక చిన్న బడ్జెట్ సినిమా కూడా నాని నిర్మాణంలో రాబోతున్నట్టు సమాచారం. అయితే, దాని వివరాలు ఇంకా బయటకు రాలేదు.
నటుడిగా నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. తర్వాత సుజిత్ డైరెక్షన్లో మరో భారీ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాని నిర్మాతగా తీసే ప్రతి ప్రాజెక్ట్‌కి తన మార్క్ టచ్ ఇవ్వడం, కాస్టింగ్ నుంచి క్రూ సెలెక్షన్ వరకు ప్రతీ స్టెప్లోను తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఆయన నిర్మాణంలో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మిగతా నిర్మాతల మాదిరిగా కాకుండా కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నాని ముందడుగు వేస్తుండటంతో, దర్శకులు, రచయితలు కూడా ఆయనతో పని చేయాలని ఆసక్తిగా ఉన్నారు.మొత్తానికి, నాని సినిమాల్లో నటించడమే కాకుండా… నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ, మెగాస్టార్ లాంటి స్టార్‌తో సినిమా చేయగల స్థాయికి ఎదిగాడు.