తెలంగాణ నేపథ్యంలో హీరో నాని నటిస్తున్న తాజా చిత్రానికి ‘దసరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గోదావరిఖని బొగ్గుగనుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఎస్ఎల్వీసీ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇంతకుముందెప్పుడూ చూడని కొత్త అవతారంలో నాని లుక్ ఉత్సుకతను రేకెత్తించేలా ఉంది. సముద్రఖని, జరినా వాహబ్ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సీ, సంగీతం: సంతోష్ నారాయణన్, ఎడిటర్: నవీన్నూలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ చాగంటి.
విజయానికి, శుభానికి సంకేతంగా జరుపుకునే దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని పలు భారీ చిత్రాల కొత్త పోస్టర్స్ సందడి చేశాయి. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ‘పెద్దన్న’, తెలంగాణ నేపథ్యంలో నాని నటిస్తున్న ‘దసరా’ చిత్రాల ఫస్ట్‌లుక్స్ ఆయా సినిమాలపై అంచనాల్ని పెంచుతూ అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.