Nani | నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉన్నారు. వరుస విజయాలతో జోరుగా దూసుకెళ్తున్న నాని, క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటూ తన రేంజ్‌ను మరింత పెంచుకుంటున్నాడు. రీసెంట్గా హిట్-3 తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన నాని, ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. దసరా తో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నాని, తర్వాత హాయ్ నాన్న తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించాడు. ఆ వెంటనే వచ్చిన సరిపోదా శనివారం తో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఇప్పుడు హిట్-3 తో వరుసగా నాలుగో విజయం సాధిస్తూ తన సత్తా చాటాడు. ప్రస్తుతం ప్యారడైజ్ అనే భారీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. 2026 మార్చి 26న విడుదలకు సిద్ధమవుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇప్పటికే లీక్ అయిన నాని లుక్‌కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ సినిమాతో మరో హిట్ ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ టైర్-2 హీరోలలో నాని ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచారు. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధిస్తూ, వరుస హిట్స్‌తో తన మార్కెట్‌ను భారీగా పెంచుకున్నారు. ఓవర్సీస్ మార్కెట్లోనూ మిలియన్ డాలర్ క్లబ్‌ను పలుమార్లు తాకిన నాని, అక్కడ కూడా బలమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
నాని సినిమాలకు “మినిమమ్ గ్యారంటీ” అనే ట్యాగ్ ఏర్పడినట్టు అయ్యింది. ఈ స్థాయికి నాని చేరినదానికి ప్రధాన కారణం అతని స్క్రిప్ట్ సెలెక్షన్. భావోద్వేగాలకు పెద్దపీట వేసే కథలు, కంటెంట్‌తో పాటు కమర్షియల్ అంశాలను కూడా సమతుల్యం చేస్తూ సినిమాలను ఎంచుకుంటున్నాడు.శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ పై అతిభారీ హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగస్టు 8న రిలీజ్ చేస్తున్నట్లో ఓ కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు. తుపాకుల రాజ్యంలో నాని ఎలాంటి విస్ఫోటం సృష్టించి ఆ రాజ్యానికి మకుటం లేని మహారాజుగా ఎదుగుతాడా.. అనే విధంగా ఈ కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ తీర్చిదిద్దడం విశేషం.. ఈ చిత్రంలో రాఘవ్ జుయాల్, సోనాలీ కులకర్ణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.