HIT 3 | స్టార్ నటుడు నాని నటించిన తాజా చిత్రం ‘హిట్- 3’ (హిట్ : ది థర్డ్ కేస్) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా.. దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన ఈ చిత్రం మే 1న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. విడుదలైన వారంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడమే కాకుండా బ్రేక్ ఈవెన్‌ని కూడా నమోదు చేసింది.
అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు అడివిశేష్ నటి శ్రీనిధి శెట్టికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు ఆటపట్టించాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. అయితే తాజాగా హిట్ 3 సక్సెస్ మీట్లో అడివి శేష్ మళ్లీ రాగా.. నాని దగ్గరుండి అడివిశేష్‌తో శ్రీనిధికి షేక్ హ్యాండ్ ఇప్పించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
‘హిట్’ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. సాను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు.
.@AdiviSesh broo😂😂❤️❤️❤️
Finally @SrinidhiShetty7 tho shakehand ippinchesav @NameisNani 🤣❤️#HIT3 pic.twitter.com/oso6sOAhFm
— 𝙉𝙖𝙫𝙚𝙚𝙣ᵀʰᵉ ᴾᵃʳᵃᵈᶦˢᵉ (@Naveen_Tweetz_) May 9, 2025