The Paradise | హిట్ 3తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్(The Paradise). దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అనౌన్స్మెంట్ టీజర్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్. ఈ సినిమా సెట్స్‌లోకి నాని ఎంటర్ అయినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో వచ్చే ఏడాది (2026) మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం 1980ల కాలంలో హైదరాబాద్‌లో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది.