నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘దసరా’. కీర్తి సురేష్ నాయికగా నటిస్తున్నది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సింగరేణి ప్రాంతమైన గోదావరిఖని దగ్గర ఉన్న ఒక గ్రామ నేపథ్యంతో ఈ చిత్ర కథ సాగనుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ యాక్షన్ పాత్రలో నానికనిపించనున్నారు.
తాజాగా ఈ చిత్ర కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారు. హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. సముద్రఖని, సాయికుమార్, జరీనా వాహాబ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సంతోష్ నారాయణన్, ఎడిటర్ : నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్ ఐఎస్సీ.