Nani | నేచురల్ స్టార్ నాని ఇప్పుడు హీరోగా కన్నా నిర్మాతగానే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కారణం ఆయన చేసే ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. రీసెంట్గా కోర్ట్ అనే సినిమాతో పెద్ధ విజయం సాధించారు. ఈ క్రమంలో నాని అంటే మంచి సినిమాలు చేస్తాడు, కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడు అని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీలో కూడా ఫిక్స్ అయ్యారు.ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో సొంత బ్యానర్ లో హిట్3 సినిమా చేస్తున్నాడు. అలానే ది ప్యారడైజ్ అనే చిత్రంలోను నటిస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.
త్వరలో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఓ ప్రాజెక్ట్ చేయనుండగా, దీనికి నాని సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అందుకు కారణం ఈసారి మళ్లీ రక్తం పారాల్సిందే అంటూ శ్రీకాంత్ చాలా వయెలెంట్ సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. చిరంజీవి గారు అనగానే డ్యాన్స్, యాక్షన్ అని మనం ఒక అభిప్రాయానికి వచ్చేశాం..కానీ ఆయన అంతుకుమించి.. చిరంజీవి కేవలం అది మాత్రమే కాదు.. ఆయన్ని ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా భావిస్తాం.. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయి వేరే దేనిపైన ఫోకస్ చేస్తున్నాం.
ఇప్పుడు శ్రీకాంత్ మ్యాడ్నెస్ని చిరంజీవి గారి సినిమా అంటే అది చాలా సూపర్ కాంబో.. అందుకే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.. ఇది నిజంగా నాకు ఓ గర్వ కారణం.. అసలు నా లైఫ్‌లో చిరంజీవి గారి లాంటి స్థాయి వ్యక్తిని పెట్టి నేను ఓ సినిమా తీస్తానని ఎప్పుడూ ఊహించలేదు.. కానీ అనుకోకుండా ఇది కుదిరింది.. ఇది గొప్ప బాధ్యతగా భావిస్తున్నా.. ఖచ్చితంగా ది బెస్ట్ ఇస్తాం అంటూ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్‌తో మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి. నాని, చిరంజీవికి ఈ ప్రాజెక్ట్ మెమోరబుల్‌గా ఉండడం ఖాయమని అంటున్నారు.. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.