HIT 3 | ‘హిట్- 3’ షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు నాని. దర్శకుడు శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో ఇది మూడో భాగం. ఇందులో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ రోల్లో నాని కనిపిస్తారు. ఈ వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలావుంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది.
ఈ సినిమాలో నానితోపాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కనిపించనున్నారట. వారెవరో కాదు. ‘హిట్’ సినిమా హీరో విశ్వక్సేన్. ‘హిట్-2’ కథానాయకుడు అడివి శేషు. కథ డిమాండ్ చేయడంతో వీరిద్దరూ ఈ సినిమా భాగం కావాల్సివచ్చిందని తెలుస్తున్నది. నాని, విశ్వక్, అడివి శేషు కాంబినేషన్ సీన్స్ ఆడియన్స్‌ని కట్టిపడేస్తాయట. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.