Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్ భామ సీతారామం ఫేం మృణాళ్ థాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌లను లాంఛ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తే.. ఈ సినిమాలో వృత్తిపరంగా ఫోటోగ్రాఫర్ అయిన నాని తన కుమార్తె కియారాకు ఒక కథ చెబుతున్నట్టుగా ట్రైలర్ మొదలైంది. అయితే ఏ విషయం చెప్పిన ఎవరిని ఊహించుకోవాలి అని అడిగే కియారా.. సడన్‌గా తన తల్లి గురించి చెప్పమని నానిని అడుగుతుంది. అయితే నాని కియారా తల్లి గురించి మృణాల్‌ను ఊహించుకోని తన లవ్ స్టోరీని నాని చెబుతాడు. ఆ తర్వాత గొడవలు పడి భార్యతో నాని విడిపోయినట్టుగా ఈ ట్రైలర్లో ఉంది. అయితే ఈ ట్రైలర్లో చూపించిన దానికంటే ఎక్కువగానే ఈ సినిమాలో సందేహలు కనిపిస్తున్నాయి. శృతి హాసన్ నిజంగా నాని భార్యనా? ఆమెకు ఏమైంది? నాని తన భార్యకు సంబంధించిన రహస్యాన్ని కూతురికి ఎందుకు దాచిపెట్టాడు? మరోవైపు నాని, మృణాల్ ల ప్రేమ ఏమవుతుంది? అనేది తెలియాలంటే డిసెంబర్ 07 సినిమా చూడాల్సిందే. ఇక తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. హాయ్ నాన్నలో బేబీ కియారా, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.