AA23 | పుష్ప.. ది రూల్‌తో బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డుల వేట మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ స్టార్ హీరో సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన రషెస్ పుష్ప.. ది రూల్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాయి. కాగా ఇప్పుడు బన్నీ మరో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. AA23గా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి చాలా రోజుల క్రితమే అల్లు అర్జున్ అప్డేట్ ఇచ్చేశాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుందన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మృణాళ్ ఠాకూర్ ప్రస్తుతం నాని 30వ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
ఈ భామ అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేయడం పక్కా అయినట్టేనాననే దానిపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. మొత్తానికి ఈ వార్త అఫీషియల్ కాకున్నా అప్పుడే బన్నీ పక్కన మృణాళ్ఠాకూర్ను ఊహించుకుంటూ సంబురపడుతున్నారు అభిమానులు. భూషణ్ కుమార్ టీ సిరీస్, సందీప్ రెడ్డి వంగా హోం బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.
సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం రణ్ బీర్‌కపూర్ హీరోగా యానిమల్ సినిమా చేస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా పూర్తయిన తర్వాత AA23 పనులపై ఫోకస్ పెట్టనున్నట్టు టాక్.
( Photos : Instagram )
MASSIVE! Three powerhouses of India, Icon Star @alluarjun, producer #BhushanKumar & director @imvangasandeep join forces. The movie under this association will be produced by @TSeries & #BhadrakaliPictures.#KrishanKumar @vangapranay @vangapictures #ShivChanana @neerajkalyan_24 pic.twitter.com/bUhXo6o8QN
— BA Raju's Team (@baraju_SuperHit) March 3, 2023