Nani | శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటీవలే ‘కలియుగం 2064’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులని అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెకేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రద్ధా శ్రీనాథ్ తరచుగా తన వ్యక్తిగత విషయాలతో పాటు,సినిమా విశేషాలను సైతం అభిమానులతో పంచుకుంటూ అలరిస్తూ ఉంటుంది.
ఈ మధ్య మాల్దీవ్స్ వెకేషన్‌ను ఎంజాయ్ చేసిన ఈ భామ బికినీలో దిగిన ఫొటోలను షేర్ చేసి కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేసింది. అంతేకాదు బికినీ షోతో అభిమానులకు గట్టిగానే గ్లామర్ ట్రీట్ అందించింది.. ఈ అమ్మడు షేర్ చేసిన ఓ ఫొటోలో బీర్ తాగుతున్నట్టు కనిపించింది. ఎంతో పద్దతిగా కనిపించే శ్రద్ధా శ్రీనాథ్ ఇలా పబ్లిక్‌గా బీర్ తాగుతుందేంటని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైన ఈ భామ బీరు తాగుతున్న ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. కొందరు శ్రద్ధా ఫొటోలపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.
శ్రద్ధా శ్రీనాథ్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. మలయాళంలో 2015లో వచ్చిన ‘కోహినూర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… ముంగారు మేల్ 2 , ఉర్వి , కాట్రు వెళియిదై, ఇవన్ తంతిరాన్ , విక్రమ్ వేద , రిచి , కృష్ణ అండ్ హిజ్ లీలా , డియర్ విక్రమ్ , విట్నెస్ , ఇరుగపాట్రు , మెకానిక్ రాకీ, డాకు మహారాజ్ వంటి పలు చిత్రాల్లో నటించి అలరించింది. ఇక 2016లో విడుదలైన కన్నడ చిత్రం యూ టర్న్ కు గాను ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కించుకున్నారు.తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించే నటి శ్రద్ధా శ్రీనాథ్ ఇటీవల గ్లామర్ డోస్ బాగానే పెంచింది. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మనసులు కొల్లగొట్టేస్తుంది. చిన్న హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈసారి జాక్ పాట్ కోసం తహతహలాడుతోంది.