Nani | ‘ మేజర్’ విజయంతో గాల్లో తేలిపోతున్న నాని..అదేంటీ..?
మేజర్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు నాని(Nani ). దీని వెనుక పెద్ద కథే ఉంది. మేజర్ కేవలం తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా మంచి కలెక్షన్స్ తీసుకొస్తుంది.
అదేంటి.. మేజర్ (Major) సినిమాతో నాని(Nani )కి సంబంధమేంటి.. ఆ సినిమాలో హీరో నాని కాదు.. నిర్మించింది ఆయన కాదు.. అలాంటప్పుడు ఎందుకు మేజర్ సినిమా విజయాన్ని ఆయన అంతగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా..? దీని వెనుక పెద్ద కథే ఉంది. మేజర్ కేవలం తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా మంచి కలెక్షన్స్ తీసుకొస్తుంది. రోజురోజుకు దీనికి అక్కడ రెస్పాన్స్ పెరుగుతుంది. మొదటిరోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా నాలుగు రోజులు 2 కోట్లకు పైగా వసూలు చేసింది. దీన్ని బట్టి మేజర్ హిందీలో ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా విజయాన్ని నిర్మాత మహేష్ బాబు బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. నాలుగు రోజుల్లో ఏకంగా 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. ఇదిలా ఉంటే మేజర్ సక్సెస్ మహేష్ కంటే నాని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి కారణం అడవి శేష్ (Adivi Sesh)హీరోగా ఈయన హిట్ 2 సినిమా నిర్మిస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. జూలై 29న ఈ సినిమా విడుదల కానుంది. మేజర్ పుణ్యమా అని ఇప్పుడు హిట్ రెండో భాగాన్ని హిందీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత నాని.
తెలుగుతో పాటు ఈ సినిమాని ఒకేసారి హిందీలో విడుదల చేయాలని ముందు నుంచి ప్లాన్ చేస్తున్నాడు నాని. కానీ ఏదో ఒక మూలన పాన్ ఇండియా వర్కౌట్ అవుతుందా అనే అనుమానంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు మేజర్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో అడివి శేష్ మార్కెట్ బాగానే పెరిగింది. దాంతో భారీ స్థాయిలో హిట్-2 హిందీ లో విడుదల చేయడానికి చూస్తున్నారు న్యాచురల్ స్టార్. ఈ సినిమాకు ఏడు సీక్వెల్స్ చేస్తామని వాటికి కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పాడు నాని. అందులో ఏదో ఒక భాగంలో ఆయన హీరోగా నటించనున్నాడు.
Read Also : Pawan Kalyan | నాని కోసం వస్తున్న పవన్ కల్యాణ్..ఫ్యాన్స్ లో జోష్
Read Also : Kamal Haasan gift | విక్రమ్ డైరెక్టర్‌కు కమల్ హాసన్ ఖరీదైన కానుక..ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Also : Sharwanand | శర్వానంద్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- adivi sesh
- hit 2
- major
- Nani
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

