తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (Telugu Film Industry)లో టాప్ పొజిషన్‌ను ఎంజాయ్ చేస్తోంది పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde). ఓ వైపు లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది. ఇటీవలే ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది పూజాహెగ్డే. స్టార్ హీరోలు, భారీ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది పూజాహెగ్డే. పరిస్తితుల దృష్ట్యా తన రెమ్యునరేషన్ (Remuneration)ను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తోందని ఓ వార్త ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పూజమ్మ పారితోషికం తాజా వార్తల ప్రకారం రూ.5 కోట్లకు చేరింది. పూరీ జగన్నాథ్‌తో చేయబోతున్న సినిమాకు పూజాహెగ్డే ఈ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ఈ మొత్తంలో రూ.4 కోట్లు పూజా రెమ్యునరేషన్ కాగా..రూ.కోటి ఆమె సిబ్బంది జీతభత్యాలకట. ఇంత పెద్ద మొత్తం తీసుకుంటున్న టాలీవుడ్ నటి పూజాహెగ్డే మాత్రమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ప్రస్తుతం పూజాహెగ్డే చేతిలో మహేశ్-త్రివిక్రమ్ సినిమాతోపాటు పవన్-హరీష్ శంకర్ ప్రాజెక్టులో నటించనుంది. ఈ రెండు సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనున్నాయనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు రెండు హిందీ సినిమాలు కూడా చేస్తోంది.