టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని మరో మూడు రోజుల్లో ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూన్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు అంటే జూన్ 9న హైటెక్‌సిటీ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. కాగా ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా ఎవరు రాబోతున్నారో తెలియజేస్తూ స్పెషల్పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. స్టార్ హీరో పవన్ కల్యాణ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు.
మేకర్స్ అడగగానే చీఫ్ గెస్టుగా వచ్చేందుకు ఓకే చెప్పాడట పవన్ కల్యాణ్. సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ షురూ కానుంది. ఈ క్రేజీ అప్డేట్తో నాని అండ్ పవన్ ఫ్యాన్స్ సంతోషంలో ఎగిరిగంతేస్తున్నారు. ఈ చిత్రంతో మలయాళీ బ్యూటీ నజ్రియా నజీమ్ (Nazriya) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
పవన్ కల్యాణ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది.
Ante…mana event ki @PawanKalyan garu vastunnaru 🤩🤩#PKforSundar ❤️#AnteSundaraniki pre release event on June 9th from 6 PM onwards 💥💥
IN CINEMAS JUNE 10 💥@NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/xw2xsotzjD
— Mythri Movie Makers (@MythriOfficial) June 7, 2022