నాని (Nani) ని సాధారణంగా దర్శకుల హీరో అంటారు..అలాగే నిర్మాతల హీరో కూడా. ఎందుకంటే రెమ్యునరేషన్ విషయంలోనూ ఇబ్బంది పెట్టినట్లు ఎప్పుడూ వార్తలు కూడా రాలేదు. కావాలంటే కావాల్సిన వాళ్ల కోసం తక్కువ పారితోషికంతో కూడా సినిమాలు చేసాడు నాని. అలాంటి నాని ఇప్పుడు ఇద్దరు నిర్మాతల విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కరోనా వైరస్ కారణంగా ఈ రోజుల్లో చాలా సినిమాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా సినిమాలు పూర్తైనా కూడా విడుదలకు నోచుకోవడం లేదు. దాంతో చాలా మంది నిర్మాతలు తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక చుక్కలు చూస్తున్నారు. కొందరు నిర్మాతలకు అయితే బడ్జెట్ 20 కోట్లు పెడితే..సినిమా విడుదల కానందుకు వడ్డీలు మరో 10 కోట్లు అదనంగా అవుతున్నాయి.
అంత దారుణంగా వడ్డీలు కూడా పెరిగిపోతున్నాయి. దాంతో భరించలేక సినిమాలను ఓటిటికి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నాని సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుందని తెలుస్తుంది. ఈయన నటించిన టక్ జగదీష్ (Tuck Jagadish) సినిమాను సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే దీనిపై నాని ససేమిరా అంటున్నాడు. తన సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్స్ లోనే విడుదల చేయాలని ఈయన నిర్మాతలకు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అలా జరగని పక్షంలో కనీసం తాను ప్రమోషన్స్ కు కూడా రానని తేల్చేసాడని.. ఈ విషయంలోనే నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో నానికి కాస్త డిఫెరెన్సెస్ కూడా వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. నాని 25వ సినిమా ‘వి’ గతేడాది ఓటిటిలోనే విడుదలై నిరాశ పరిచింది.
ఆ చేదు అనుభవంతోనే ఇప్పుడు టక్ జగదీష్ ను థియేటర్స్ లో విడుదల చేయాలని కోరుతున్నాడు నాని. అయితే నిర్మాతలు మాత్రం పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటిటి వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సినిమా నుంచి థమన్ కూడా తప్పుకోవడంతో గోపీ సుందర్ ను తీసుకొచ్చి బ్యాగ్రౌండ్ స్కోర్ చేయిస్తున్నట్లు తెలుస్తుంది. శివ నిర్వాణ (Shiva Nirvana) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రితూ వర్మ హీరోయిన్. ఏదేమైనా కూడా టక్ జగదీష్ విషయంలో నాని, నిర్మాతల మధ్య చిన్నపాటి ఘర్షణ అయితే జరిగిందని విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరి నిజంగానే నాని సినిమాను ఓటిటిలో విడుదల చేస్తారా లేదంటే నాని మాట విని వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..
JokkeJokkeMeke Song | ‘జోకే జోకే మేకే’ పుష్ప సాంగ్ ఇంట్రడక్షన్ వీడియో కేక
Meet Cute| జెట్ స్పీడ్లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?