Dasara Movie Friendship Poster | గత కొంత కాలంగా నాని కమర్షియల్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ‘అంటే సుందరానికీ’ పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా మిగిలింది. ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో నాని మొదటి స్థానంలో ఉంటాడు. ఈయన కెరీర్లో ఇప్పటివరకు తీసినవన్ని ఒకదానికొకటి సంబంధంలేకుండా విభిన్నంగా ఉంటాయి. అయితే ఈయన సినిమాలను ప్రేక్షకులు ఆధరిస్తున్నా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోతున్నాయి. నాని గత ఐదారు చిత్రాలు కూడా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయాయి. నిజానికి చెప్పాలంటే ‘ఎమ్సీఏ’ తర్వాత నాని కెరీర్ ఆ స్థాయిలో ఇప్పటివరకు మరో హిట్టు లేదు. ఈ క్రమంలోనే నాని ఈ సారి ‘దసరా’ సినిమాతో అవుట్ అండ్ అవుట్ మాస్ కథతో కమర్షియల్ హిట్టు కొట్టడానికి ముస్తాబవుతున్నాడు.
ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పాయి. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో నాని గూడ్స్ ట్రైన్లో తన గ్యాంగ్‌తో కలిసి హాస్యాన్ని చిందిస్తున్నాడు. ‘ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం’ అంటూ చిత్రబృందం క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. శ్రీకాంత్ ఓదేలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుందట.
ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. తెలంగాణలోని గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కె అవుట్ అండ్ అవుట్ రా సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణ్, సత్యన్ సూర్యన్ స్వరాలను సమకూరుస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Dhoom dhaam dostaan
Iraga maraga chedhaam ❤️🔥#HappyFriendshipDay #Dasara pic.twitter.com/0JrI1mybmf— Nani (@NameisNani) August 7, 2022