నాని కథానాయకుడిగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే..సుందరానికి’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. సినిమాలోని తొలిగీతం ‘పంచెకట్టు’ పాటను విడుదల చేయడంతో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఆరంభించారు. హసిత్గోలీ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను క్లాసికల్ సింగర్ అరుణా సాయిరామ్ ఆలపించారు.
వివేక్‌సాగర్ స్వరకర్త. ట్రెండీ ట్యూన్‌తో ఆద్యంతం సరదాగా ఈ పాట సాగింది. ‘రంగంలో దూకారు..భలే అందంగా మాస్టారు..సరదాగా సరుకే మీరు..’ అనే చరణాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట సక్సెస్‌ను పురస్కరించుకొని ‘పంచెకట్టు థీమ్ పార్టీ’ని ఏర్పాటు చేశారు. దీనికి యూనిట్ సభ్యులందరూ పంచెకట్టుతో హాజరయ్యారు. జూన్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.