‘ఓజీ’తో పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు దర్శకుడు సుజిత్. సినిమా చివర్లో సీక్వెల్‌ను కూడా అనౌన్స్ చేశాడు. అయితే.. అది ఇప్పుటికిప్పుడు జరిగే పనికాదు. దానికి చాలా సమయం కావాలి. నిజానికి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తర్వాత మరో సినిమాకు పవన్ ఓకే చెప్పలేదు. కాబట్టి, అసలు ఆయన సినిమాలు కంటిన్యూ చేస్తారా? లేదా? అనేది కూడా ఓ సందేహమే. మరి సుజిత్ నెక్ట్స్ సినిమా ఎవరితో? అంటే.. దానికి సింపుల్ సమాధానం ‘నాని’.
అవును.. నెక్ట్స్ నానితో సినిమా చేయబోతున్నారు సుజిత్. కథ కూడా ఖరారైంది. డార్క్ క్రైమ్ కామెడీ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తున్నది. సుజిత్ మార్క్ యాక్షన్, ైస్టెలిష్ మేకింగ్‌తో ఈ సినిమా రూపొందనున్నదని సమాచారం. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తవ్వగానే సుజిత్ సినిమా మొదలవుతుంది. ఈ సినిమా నిర్మాత, తదితర విషయాలు తెలియాల్సివుంది.