నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం విదితమే. ఈ సినిమా తర్వాత ఆయన సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తారు. ‘ది ప్యారడైజ్’ 2026 మార్చిలో విడుదల కానుంది. ఆ వెంటనే సుజిత్ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేస్తారట నాని. ఇదిలావుంటే.. ఈ సినిమాకు ‘గన్స్ అండ్ రోజెస్’ అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తున్నది.
సుజిత్ దర్శకత్వంలో పవన్‌కల్యాన్ హీరోగా ఇటీవల విడుదలైన ‘ఓజీ’ సినిమాలో ‘గన్స్ అండ్ రోజెస్’ అంటూ సాగే పాట ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ ప్రేరణతోనే కాక, కథ పరంగానూ ఈ సినిమాకు ఆ టైటిల్ సరిగ్గా ఉంటుందని సుజిత్ భావిస్తున్నారట. ఇందులో సుజిత్ మార్క్ ైస్టెలిష్ హీరోగా నాని కనిపిస్తారని తెలుస్తున్నది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయిక ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.