Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నుంచి వస్తున్న తాజా ప్రాజెక్ట్ నాని 30 (Nani 30). డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv) డైరెక్ట్ చేస్తున్నాడు. సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. రెడీనా..? అంటూ నాని ప్యారాచూట్‌తో ఆకాశంలో విహరిస్తూ.. జులై 13న నాని 30 ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేయబోతున్నామని ప్రకటించాడని తెలిసిందే. ముందుగా ప్రకటించిన ప్రకారం సస్పెన్స్‌కు తెరదించాడు. ఈ చిత్రానికి హాయ్ నాన్న (Hi Nanna) టైటిల్‌ను ఫైనల్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్‌తోపాటు గ్లింప్స్ ను లాంఛ్ చేశారు.
నా ఫ్రెండ్ యశ్నను కలవండి.. అంటూ మృణాళ్ ఠాకూర్‌ను తన స్నేహితురాలికి పరిచయం చేస్తూ బేబి కైరా చెప్తున్న డైలాగ్స్‌తో షురూ అయింది గ్లింప్స్. ఆ తర్వాత మా నాన్న అని అంటోంది. హర్ట్ టచింగ్ ట్యూన్‌తో సాగుతూ తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సినిమా ఉండబోతుందని గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన నాని 30 అనౌన్స్మెంట్ గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు. నాని 30 చిత్రానికి సను జాన్ వర్గీస్ ఐఎస్సీ కెమెరామెన్. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల తర్వాత కెమెరామెన్ సను జాన్ వర్గీస్ ఐఎస్సీ మరోసారి నానితో చేస్తున్న మూడో సినిమా ఇది.
హాయ్ నాన్న చిత్రానికి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి ప్రవీణ్ ఆంటోనీ ఎడిటర్ కాగా.. జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నాడు. మృణాళ్ ఠాకూర్, నాని, బేబి కైరా మధ్య సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు గ్లింప్స్ చెబుతోంది.
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
She calls me that…
Not the little one 😉Glimpsehttps://t.co/oY0v1h84Ms pic.twitter.com/KrU3U8kaPS
— Nani (@NameisNani) July 13, 2023
నాని 30 గ్లింప్స్ వీడియో..