ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించిన అక్కడి ప్రభుత్వానికి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శి టి.ప్రసన్నకుమార్. ఏపీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తూ వైజాగ్, తిరుపతి, రాజమండ్రిలో స్టూడియోల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని ఆయన పేర్కొన్నారు. ఏపీలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం పూర్తి సహాయసహకారాలు అందిస్తామని, అలాగే నంది అవార్డులను పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న ఇతర అవార్డులను కూడా అందించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు ప్రసన్నకుమార్ తెలిపారు.