కొత్త ఎన్టీఆర్‌ని పరిచయం చేస్తున్నా!
‘కొత్తవాళ్లను వెండితెరకు పరిచయం చేయడంలో నాకు మంచి పేరుంది. అందులో నాకు సంతృప్తి కూడా ఉంది. అందుకే విరామం తర్వాత మేం చేస్తున్న చిత్రాన్ని కొత్తవాళ్లతో చేయాలనుకున్నాం.
‘కొత్తవాళ్లను వెండితెరకు పరిచయం చేయడంలో నాకు మంచి పేరుంది. అందులో నాకు సంతృప్తి కూడా ఉంది. అందుకే విరామం తర్వాత మేం చేస్తున్న చిత్రాన్ని కొత్తవాళ్లతో చేయాలనుకున్నాం. అందులో భాగంగానే ‘న్యూ టాలెంట్ రోర్స్’ అనే బ్యానర్‌ని స్థాపించాం. ఈ సంస్థకు నిర్మాతగా నా భార్య యలమంచిలి గీత వ్యవహరిస్తారు. మేం నిర్మించనున్న సినిమాకు సంబంధించి న్యూ టాలెంట్కోసం వెతుకుతున్నప్పుడు టి.ప్రసన్నకుమార్‌గారు ఓ కుర్రాడ్ని చూపించారు. తనెవరోకాదు, స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి ముని మనవడు, స్వర్గీయ నందమూరి హరికృష్ణగారి మనవడు.. స్వర్గీయ నందమూరి జానకిరామ్‌గారి తనయుడు ‘నందమూరి తారకరామారావు’ అని తెలిపారు దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి.
తన తాజా ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారాయన. ఇంకా మాట్లాడుతూ ‘తనకు కొడుకు పుట్టినప్పుడే ఓ కల కని ఎన్టీఆర్ అనే పేరును కొడుక్కి పెట్టుకున్నారు జానకిరామ్. దానికి తగ్గట్టే ఆ కుర్రాడు కూడా అందగాడు, చక్కని వాచకం, మంచి నడవడిక. తండ్రి కల సాకారం చేయాలనే తపన కూడా అతనిలో ఉంది. అతడ్ని చూసినప్పుడు అన్నగారి నాలుగో తరాన్ని కొనసాగించే కెపాసిటీ అతనికి ఉందని అనిపించింది. ఏదేమైనా అన్నగారి నాలుగోతరాన్ని తెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. మరో సమావేశంలో అతని రూపాన్ని రివీల్ చేస్తాం. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అని తెలిపారు వైవీఎస్. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేశ్ అత్తిలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

