ఆగస్ట్ 30 నాటికి నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా గురువారం ఆయన్ను తెలుగు చలనచిత్రరంగ ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు అందించారు. సెప్టెంబర్ 1న సినీ,రాజకీయ చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో, బాలకృష్ణకు ఘన సన్మానం నిర్వహించనున్నట్టు వారు ప్రకటించారు. నిర్మాతలు కె.ఎల్.దామోదరప్రసాద్, సునీల్నారంగ్, టి.ప్రసన్నకుమార్, వల్లభనేని అనిల్ తదితరులు బాలకృష్ణను కలిసిన వారిలో ఉన్నారు.