బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ చాలా ఏళ్ల తర్వాత రాధేశ్యామ్ అనే రొమాంటిక్ ప్రేమకథ చిత్రంతో ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇటలీ నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథ ఇది. విక్రమాదిత్యగా ప్రభాస్ ప్రత్యేకమైన పాత్రలో సందడి చేయనున్నారు. ఆయన్ని ఓ సరికొత్త లుక్‌లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకుడు.
జనవరి 14న సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ సినిమాకి సంబంధించిన రెండో పాట మొదట హిందీ వెర్షన్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ‘ఆషికీ ఆ గయి’ అంటూ సాగే ఈ వీడియో సాంగ్‌లో ప్రభాస్-పూజాల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఫిదా చేసేలా ఉంది. తాజాగా తెలుగు వర్షెన్ విడుదల చేశారు. నగుమోము తారాలే అనే సాంగ్ మనసుని హత్తుకునేలా ఉంది.
ఈ సినిమాకి దక్షిణాది భాషల్లో జస్టిన్ ప్రభాకరన్, హిందీలో మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఈ రాతలే…’ పాటకి చక్కటి స్పందన లభించింది. మంచి మెలోడీగా సాగే ‘నగుమోము తారలే..’ పాట కూడా అందరినీ అలరించేలా ఉంది . సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానున్న ఈ చిత్రాన్ని గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.