యువ హీరో అక్కినేని అఖిల్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసి, వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితురాలు జైనబ్ రవ్జీతో ఆయన వివాహం శుక్రవారం అక్కినేని నాగార్జున నివాసంలో ఘనంగా జరిగింది.
కుటుంబ సభ్యులతోపాటు నాగార్జునకు అత్యంత సన్నిహితులైన చిరంజీవి కుటుంబం కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. దర్శకుడు ప్రశాంత్‌నీల్, శర్వానంద్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులకు ఆశీర్వచనాలు అందించారు. అఖిల్ పెళ్లి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 8న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో రిసెప్షన్ జరుగనున్నది.