Nagarjuna Next Movie | కింగ్ నాగార్జునకు గత కొంత కాలంగా సరైన హిట్టు లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత ఇప్పటివరకు ఈయనకు సోలో హిట్ లేదు. హిట్ సంగతి పక్కన పెట్టు, ఈయన సినిమాలు కనీసం బడ్జెట్లో సగం కూడా రికవరీ చేయలేకపోతున్నాయి. సోగ్గాడే తర్వాత ఆయన సోలోగా చేసిన ‘ఓం నమో వేంకటేశాయ’, ‘ఆఫీసర్’, ‘మన్మధుడు-2’ సినిమాలు కనీసం వారం కూడా థియేటర్లలో ప్రదర్శితం కాలేకపోయాయి. గతేడాది విడుదలైన ‘వైల్డ్ డాగ్’.. ఆ ముందు సినిమాలతో పోలిస్తే కొంచెం బెటర్‌గా పర్ఫార్మ్ చేసింది. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో హిట్ అందుకున్న అందులో సగం క్రెడిట్ నాగచైతన్యకు దక్కుతుంది.
ఈ క్రమంలో బాగా కష్టపడి చేసిన ‘ది ఘోస్ట్’ కూడా నాగార్జునకు నిరాశే మిగిల్చింది. దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన కింగ్.. ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో సతమతవుతున్నాడు. ఈ నేపథ్యంలో నాగ్ తన తదుపరి సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇందులో భాగంగానే ఓ యంగ్ దర్శకుడిగా చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ‘సినిమా చూపిస్త మామా’, ‘నేను లోకల్’ వంటి సినిమాలకు కథ, మాటలు అందించిన ప్రసన్న కుమార్ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలల నుండి ఈ కాంబోలో సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కాంబో దాదాపు కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ముందుగా నాగ్ తన తదుపరి సినిమాను ‘గాడ్‌ఫాదర్’ ఫేం మోహన్‌రాజా దర్శకత్వంలో చేయాలని భావించాడు. కానీ గాడ్‌ఫాదర్ ఫలితం తేడా కొట్టడంతో స్ట్రీప్ట్ను హోల్డ్‌లో ఉంచినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రసన్న కుమార్ చెప్పిన కథ నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు జరిపాడట. ప్రస్తుతం ప్రసన్న కుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ధమాకా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
నాగార్జున ఇప్పటి వరకు 20మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ఈ ఇరవైలో డెబ్యూగా తక్కువ మంది హిట్లు సాధించారు. అయినా కానీ నాగ్ మరోసారి కొత్త దర్శకుడితో ప్రయోగం చేస్తున్నాడంటే విశేషం అనే చెప్పాలి.