Ajithkumar movie | ఇప్పుడు మన హీరోలు మల్టీస్టారర్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కథ నచ్చితే ఇతర ఇండస్ట్రీ హీరోలతో కూడా మనవాళ్లు మల్టీస్టారర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో మరో మల్టీస్టారర్ సిద్దమైనట్లు సమాచారం. కాని ఈ సారి తమిళ హీరోతో మన స్టార్ జతకట్టనున్నాడు. ఆయనేవరో కాదు..అక్కినేని నాగార్జున. ప్రస్తుతం ఈయన అజిత్ కుమార్‌తో మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నట్లు సమాచారం.గ్యాంబ్లర్, వివేకం, విశ్వాసం వంటి సినిమాలతో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తెలుగులోను మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాలిమై చిత్రంలో నటిస్తున్నాడు. బోనికపూర్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత అజిత్ ఇదే కాంబోలో #AK61 రానుంది. తాజాగా ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం మేకర్స్ నాగార్జునను సంప్రదించినట్లు తెలుస్తుంది.
అజిత్ కుమార్‌కు ఒక దర్శకుడు నచ్చితే ఆయనతో వరుసగా సినిమాలు చేస్తాడు. ఇప్పటికే
అజిత్-హెచ్ వినోద్ కాంబోలో నేర్కొండపరువై(పింక్ రిమేక్), వాలిమై తెరకెక్కగా మూడవ చిత్రం #AK61 రూపొందనుంది. ఇక ఇందులో కీలకపాత్ర కోసం నాగార్జునను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో నాగార్జున పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించనున్నాడట.అంతే కాకుండా ఈ చిత్రానికి కో ప్రోడ్యూసర్‌గా కూడా నాగార్జున వ్వవహరించుతున్నట్లు సమాచారం.ఇక ఇందులో మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ మరో కీలక పాత్రలో నటించనున్నాడని టాక్.ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంలో అధితి రావు హైదరి హీరోయిన్గా నటించనుంది. ఇక నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సక్సెస్‌తో జోరుమీదున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం 76కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి నాగార్జున కెరీర్లోనే హైయస్ట్ గ్రాసర్ గా నిలిచింది.