Nagarjuna | టాలీవుడ్లో వయసుతో పని లేకుండా స్టైల్, హ్యాండ్సమ్తో మెరిసే హీరో ఎవరు అంటే, ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కింగ్ నాగార్జున. ఆరుపదుల వయస్సు దాటిన కూడా ఇంకా యంగ్ హీరోల మాదిరిగా కనిపిస్తున్నాడు. నాగ చైతన్య, అఖిల్‌లకి నాగార్జున అన్నయ్యలా ఉంటాడే తప్ప తండ్రిగా అస్సలు కనిపించరు. నాగ్ ఎక్కడికి వెళ్లి కూడా ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటనే ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ఇటీవల కూలీ సినిమా ప్రమోషన్స్ సమయంలో నాగార్జునని రజనీకాంత్ తెగ పొగిడేశారు. ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని నేను అడిగితే వ్యాయామం చేయడమే అని నాకు చెప్పారు అని రజనీకాంత్ అన్నారు.
అయితే తాజాగా కూలీ ప్రమోషన్స్ సమయంలో నాగార్జున తన ఫిట్నెస్ కి సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట వరకు వ్యాయామం తప్పనిసరిగా చేస్తాను. ఏకకాలంలో ఒకే టైపు వర్కౌట్స్ కాకుండా ఓ రోజు వెయిట్ ట్రైనింగ్, మరో రోజు ట్రెడ్ మిల్ మీద రన్నింగ్, ఒక రోజు స్విమ్మింగ్, మరో రోజు వాకింగ్ ఇలా భిన్న రకాల వర్కౌట్స్ చేస్తూ శరీరానికి కొత్త ఉత్సాహం అందిస్తాను. వ్యాయామ సమయంలో ఫోన్ చూడను, మధ్యలో బ్రేక్స్ తీసుకోను. రోజులో 12 గంటల పాటు మాత్రమే ఆహారం తీసుకుంటాను, మిగతా 12 గంటలు ఉపవాసం ఉంటాను. ఉదయం పూట డైట్ ఏంటంటే.. కిమ్చి, ఉడికించిన క్యాబేజీ, బ్రొకోలి, కొద్దిగా కూరగాయ ముక్కలు, గోరువెచ్చిన నీరు, కాఫీ.
మధ్యాహ్నం భోజనంలో పప్పు, కూర, పచ్చడి, నాన్‌వెజ్‌తో సంపూర్ణ భోజనం చేస్తాను. రాత్రి డిన్నర్ సాయంత్రం 7 – 7.30 మధ్యలో పూర్తి చేస్తాను..అందులో సలాడ్స్, చికెన్ లేదా ఫిష్ ఉంటాయి. స్వీట్స్ అంటే ఇష్టం. కానీ అధికంగా తినను. ఒక్కోసారి స్వీట్ తింటే, మరుసటి రోజు హెవీ వర్కవుట్ చేస్తాను.. లేట్ నైట్ షూటింగ్‌లు లేకపోతే ప్రతిరోజూ ఒకే టైంకి పడుకుంటాను. సెలబ్రిటీల జీవితంలో ఒత్తిడులు తప్పవు. కానీ అవసరం లేని విషయాల గురించి ఆలోచించొద్దు అని నా తండ్రి ఇచ్చిన సలహాని పాటిస్తుంటాను అని నాగార్జున స్పష్టం చేశారు. అయితే ఈ ఫిట్నెస్ సీక్రెట్స్ అనుసరించడం చాలా వరకూ సాధ్యమే. కాని ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి, డిసిప్లిన్‌గా ఉంటేనే ఫలితం వస్తుంది. అందుకే ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే సరైన డైట్, వ్యాయామం, నిద్ర ఈ మూడు మీ జీవితంలో భాగం చేయండి!