వైల్డ్ డాగ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సెలబ్రిటీలు వైల్డ్ డాగ్ పుష్ అప్ ఛాలెంజ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 30 సెకన్లలో సింగిల్ పుష్ అప్ చేసే ఛాలెంజ్ లో ఇప్పటికే కన్నడ సోయగం రష్మిక మందన్నా పాల్గొన్నది. సార్..చూడండి ఇప్పటికీ చాలా కష్టపడుతున్నా. ఒక రోజు మీ బాడీగార్డుగా నియమించబడుతా..అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
You need to beat this dear @iamRashmika !!😄❤️ https://t.co/3wLcJJOPFc pic.twitter.com/IMvs9wk68t
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 30, 2021
రష్మిక సింగిల్ పుష్ అప్ వీడియో నెట్టింట్లో వైరల్ కూడా అయింది. అయితే తాజాగా నాగార్జున నిమిషన్నరపాటు సింగిల్ పుష్ అప్ చేసి వీడియోను పోస్ట్ చేస్తూ..ప్రియమైన రష్మిక ఈ ఛాలెంజ్‌ను నువ్వు బీట్ చేయాలి అంటూ ఛాలెంజ్ చేశారు. మరి రష్మిక నాగార్జున ఛాలెంజ్‌ను స్వీకరించి..ఆ రికార్డును బ్రేక్ చేస్తుందో..? లేదో చూడాలి. వైల్డ్‌డాగ్ ఏప్రిల్ 2న విడుదల కాబోతుంది.